నెల్లూరు: మర్రిపాడు మండలం నందవరంలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తెలిపారు. అర్హులైన వారు మార్చి 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.