NZB: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో గత కొన్ని రోజులు నుంచి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రస్తుతం ఫ్యాన్ల వినియోగం కాస్త పెరిగింది. రానున్న రోజుల్లో కూలర్ల వినియోగం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు.