GNTR: చంద్ర గ్రహణ ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేస్తున్నారు. సంప్రదాయాల ప్రకారం గ్రహణ కాలంలో ఆలయ ద్వారాలను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గ్రహణం ముగిసిన అనంతరం, ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి భక్తులకు అనుమతిస్తారు. కావున భక్తులు గమనించి సహకరించాలని కోరారు.