Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (మార్చి 30, 2023)
మేష రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వృత్తిపరంగా కొన్ని చికాకులు రావొచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధనం ఖర్చు, స్వల్ప ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
మేష రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వృత్తిపరంగా కొన్ని చికాకులు రావొచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధనం ఖర్చు, స్వల్ప ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
వృషభ రాశి: ప్రముఖులను కలుస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీరు బంగారం వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిథున రాశి: వ్యాపారస్థులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దగ్గరి వారి కారణంగా కాస్త అశాంతి కలిగే ఆస్కారం ఉంది. సన్నిహితులు, బంధుమిత్రుల సలహాలు తీసుకోండి.
కర్కాటక రాశి: స్థానచలనము కలుగుతుంది. మీరు చేస్తున్న పనిని మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. అధికారుల మూలకంగా అశాంతి కలుగుతుంది. ధన లాభము ఉంది.
సింహ రాశి: ఉదర సంబంధ బాధలకు ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కన్యా రాశి: శత్రు బాధలు తొలగిపోయే అవకాశముంది. భాగస్వాములతో వ్యవహార సిద్ధి కలుగుతుంది. నష్టపోయినట్లుగా వదిలేసిన, ధనం చేతికి వస్తుంది.
తులా రాశి: ఋణ మూలకమైన అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులపై అపవాదాలు ఆందోళన కలిగించవచ్చు. శుభవార్తలు వింటారు.
వృశ్చిక రాశి: ఇష్టమైన వస్తువులు చేతికి అందకపోవచ్చు. కొద్దిగా ధనప్రాప్తి ఉంటుంది.
ధనుస్సు రాశి: క్రయ విక్రయములు సంతోషాన్ని కలిగిస్తాయి. సరైన ఆలోచనలతో కార్యసిద్ధి కలుగుతుంది. దైవసంబంధ వ్యవహారాలలో పాల్గొంటారు. సోదరులు మూలకంగా ధనలాభం కలుగుతుంది.
మకర రాశి: వాక్చాతుర్యం కారణంగా పనులు చక్కబడతాయి. ఇష్టమైన వ్యక్తులతో కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మస్థైర్యంతో విజయాలను అందుకుంటారు. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.
కుంభ రాశి: జ్వరం వంటి స్వల్ప సమస్యలు ఎదురవుతాయి. తల్లిదండ్రుల అనారోగ్యముతో ఆందోళన చెందుతారు. కష్టానికి గుర్తింపు లభించకపోవడం ఆందోళన కలిగించవచ్చు.
మీన రాశి: వివాదాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులను కలుస్తారు. వ్యయం పెరిగినప్పటికీ అనుకున్న పనులను పూర్తి చేస్తారు.