ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ స్పందించాడు. శ్రేయస్ ఆత్మవిశ్వాసం అద్భుతమని.. తర్వాతి మ్యాచుల్లోనూ ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని తెలిపాడు. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను పక్కనపెట్టడం సరికాదన్నాడు.