టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిని ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భాగం చేశారు. ఈ సిరీస్లో అతడు రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా భాగమయ్యే అవకాశం ఉంది.