KKD: జిల్లా నూతన ఎస్పీ బిందు మాధవ్ని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన నాయకులు డా బి ఎన్ రాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిస్థితులు తెలియజేసి జిల్లాలో దళితుల పై జరిగే దాడులను అరికట్టాలని, అలాగే యువత పై గంజాయి ప్రభావం విపరీతంగా ఉందని దాని కట్టడి పై దృష్టి సారించాలని కోరారు.