CM Jagan మరచిపోయి టీడీపీకి ఓటేసి ఉండొచ్చు: అచ్చెన్నాయుడు సంచలనం
Atchannaidu:టీడీపీ నగదు ఆఫర్ చేసిందనే కామెంట్లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. సీఎం జగన్పై (jagan) ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగనే మరచిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని కామెంట్ చేశారు.
Atchannaidu:ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో (mlc elections) ప్రతిపక్ష టీడీపీ (tdp) పుంజుకుంది. 3 గ్రాడ్యుయేట్ (3 graduate mlc elections) ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. తగిన బలం లేకున్నా ఎమ్మెల్సీ కోటాలో ఒక సీటును కైవసం చేసుకుంది. ఇదీ రాజకీయంగా దుమారం రేపింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు (ycp mla) క్రాస్ ఓటింగ్ చేశారని.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలకు టీడీపీ నగదు ఆఫర్ చేసిందని వైసీపీ (ycp) ఎదురుదాడికి దిగింది. ఇందుకు ఊతమిస్తూ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad).. తనకు రూ.10 కోట్లు ఇవ్వబోయారని ఆరోపించారు. దీంతో ఈ మూడు పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది.
టీడీపీ నగదు ఆఫర్ చేసిందనే కామెంట్లపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. సీఎం జగన్పై (jagan) ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం జగనే మరచిపోయి టీడీపీకి ఓటేశారేమో ఎవరికి తెలుసు? అని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందని గుర్తుచేశారు. ఆ సీక్రెట్ ఓటింగ్ వివరాలు బయటకు ఎలా వెల్లడయ్యాయో సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) చెప్పాలని అచ్చెన్నాయుడు (Atchannaidu) డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలను అచ్చెన్నాయుడు (Atchannaidu) ఖండించారు. వైసీపీ పిచ్చి ప్రేలాపనలు ఆపాలని ఆయన హితవు పలికారు. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొనుగోలు చేశారో సీఎం జగన్ (jagan) చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమను సంప్రదించలేదని స్పష్టంచేశారు. తమ పార్టీకి తగిన మద్దతు ఉందని.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు తమకు ఓటు వేసి ఉంటారని పేర్కొన్నారు.