ASR: గంజాయి, మాదకద్రవ్యాలతో స్నేహం చేస్తే ప్రతి ఒక్కరి భవిష్యత్తు అంధకారమయం అవుతుందని అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి బుధవారం ఒక ప్రకటనలు పేర్కొన్నారు. ఆనంద భరితమైన జీవితం కావాలన్నా, బంగారు భవిష్యత్తుకు మార్గం రావాలన్న గంజాయి మాదకద్రవ్యాలు ఇతర మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ఆయన ప్రకటనలో పిలుపునిచ్చారు.