ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, అశ్విన్‌కు అవమానం జరగడంతోనే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అభిమానులు నెట్టింట కామెంట్లు చేశారు. తాజాగా వీటిపై అశ్విన్ స్పందించాడు. ‘బయట అనుకొనేవన్నీ నిజాలు కాదు. నేను బ్రేక్ కావాలని నిర్ణయించుకున్నా. అందుకే, సిరీస్ మధ్యలోనే వచ్చేశా. అంతకంటే మరే కారణం లేదు’ అని పేర్కొన్నాడు.