ASR: అరకులోయ మండలం, పద్మాపురం పంచాయతీ దుమ్మగూడ గ్రామంలో సోమవారం సర్పంచ్ పెట్టేలి సుస్మిత త్రాగునీటి బోరు పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1.50లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో బోర్ నిర్మిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ బోరుతో గ్రామంలో త్రాగునీటి సమస్య తీరుతుందని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జన్ని భగత్ రామ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు