TG: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ను కలిశారా? అంటూ ఓ విలేకరు జానీని అడిగాడు. దానికి ‘లేదు. జైలు నుంచి వచ్చాక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నా’ అంటూ జానీ బదులిచ్చాడు.