TG: బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో చెప్పినదానికే కట్టుబడి ఉంటామని.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని చెప్పారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవని సినీ ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కాగా, సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం కొనసాగుతుంది.