NLG: గ్రామీణ ప్రాంతాల్లో లింకు రోడ్లకు నిధులు మంజూరు చేయాలని, నిర్మల నుంచి శేరిగూడెం రోడ్డు బాగు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సీపీఎం నాయకులు, గ్రామస్తులతో కలిసి రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు బాగా లేకపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.