నిర్మల్: జన్నారం మండలంలోని వివిధ అటవీ క్షేత్రాలలో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని జన్నారం అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ సుష్మారావు తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మండలంలోని జన్నారం, ఇందనపల్లి అటవీ రేంజ్ పరిధిలో జనవరి 4, 5 తేదీలలో బర్డ్ వాక్‌ను మరోమారు నిర్వహిస్తామన్నారు. ఇందులో పాల్గొనేవాలనుకునే వారు రూ. రెండు వేల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.