KMR: పార్టీ బలోపేతం కోసం బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుంట లక్ష్మారెడ్డి తెలిపారు. కామారెడ్డిలోని గూడెం గ్రామంలో బూత్ కమిటీ అధ్యక్షుడిగా జీవన్ గౌడ్‌ను నియమించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు.