హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్, BRS రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ వ్యవహారం హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. దళిత బహుజన వర్గాల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు శ్రీనివాస్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అతన్ని మసబ్ ట్యాంక్ పీఎస్‌కి తీసుకెళ్లారు.