ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ఆయకట్టులోని ప్రతి చేనుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. యాసంగి సీజన్లో రైతుల పొలాలకు సాగునీటిని అందజేసే విషయమై గురువారం కడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇరిగేషన్ అధికారులు, పీఏసీఎస్ ఛైర్మన్లు, రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయకట్టు పరిధిలోని ప్రతి పొలానికి నీటిని అందిస్తామని ఆయన తెలిపారు.