ఇప్పటివరకు అందరు CMలు సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు అన్నారు. ‘ప్రస్తుత ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ HYDలో నిర్వహించినట్లే, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని కోరుతున్నాను’ అని పేర్కొన్నారు.