ఖమ్మం: ఖమ్మం-ఇల్లందు రూట్లో పాత లింగాల క్రాస్ రోడ్డు నుండి మర్రిగూడెం గ్రామ వరకు ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వి రాకేష్ ప్రభుత్వాన్ని ఆర్అండ్బీ అధికారులను గురువారం డిమాండ్ చేశారు. అనంతరం మాస్ లైన్ ఆధ్వర్యంలో మర్రిగూడెం ప్రాంతంలో రాస్తారోకో చేపట్టారు.