NLG: భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శత ఉత్సవాలను జయప్రదం చేయాలని గురువారం దామరచర్ల కేంద్రంలోని సీపీఐ జెండాను నాయకులు కార్యకర్తలతో కలిసి మండల కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్ ఎర్రజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ప్రముఖులు బంటు వెంకటేశ్వర్లు, ఎండి సయ్యద్, డాక్టర్ వెంకన్న, వలపట్ల వెంకన్న, తదితరులున్నారు.