NLG: నల్గొండ మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈ నెల 28 తేదీన మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.