అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో తాను పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై ప్రముఖ సింగర్ మీకా సింగ్ తాజాగా స్పందించాడు. తాను భారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్లు తెలిపాడు. కానీ అనంత్ తనకు రూ.2 కోట్లు విలువ చేసే వాచ్ ఇవ్వలేదని, అది తనని బాధించిందని సరదాగా చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.