ఇవాళ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా ఆయనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘స్పిరిట్’ షూటింగ్ కోసం ఆసక్తిగా ఉన్నట్లు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సందీప్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.