‘నో ఎంట్రీ’ సినిమాపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మూవీతో పోలిస్తే పార్ట్ 2 చాలా బాగుంటుందని అన్నాడు. ‘పార్ట్ 1లో నటించిన నటీనటులతో పార్ట్ 2 ప్లాన్ చేశా. వాళ్ల కోసం ఎంతో ఎదురుచూశాను. కాకపోతే వాళ్లకంటూ కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని నేను గౌరవించా. అందుకే కొత్త వాళ్లతో మూవీ చేస్తున్నా’ అంటూ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.