NDL: మహానంది గ్రామంలో సోమవారం వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి క్యాన్సర్ సర్వే సోమవారం నిర్వహించారు. ఎంపీహెచ్ఓ హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎల్హెచ్పీ సునీత, ఏఎన్ఎం మహాలక్ష్మి, ఆశా కార్యకర్తలు ఈశ్వర్ నగర్ కాలనీలో వివరాలు సేకరించారు. క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కల్పించి, అనుమానాస్పద మచ్చలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.