'Mahesh-Rajamouli' : ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. షూటింగ్‌కు ముందు చాలా రోజుల పాటు ప్రభాస్, రానా, అనుష్కలతో వర్క్ షాప్ నిర్వహించాడు. వాళ్లు యుద్ధం కోసం ఎంతగానో శ్రమించారు.
ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్లకు పైగా సమయాన్ని తీసుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. షూటింగ్‌కు ముందు చాలా రోజుల పాటు ప్రభాస్, రానా, అనుష్కలతో వర్క్ షాప్ నిర్వహించాడు. వాళ్లు యుద్ధం కోసం ఎంతగానో శ్రమించారు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ కోసం ఎన్టీఆర్, చరణ్‌లతో కూడా వర్క్ షాప్ నిర్వహించారు. దాంతో రాజమౌళి సినిమా అంటే.. షూటింగ్‌కు ముందు హీరోలు వర్క్ షాప్ చేయాల్సిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబుతోను లాంగ్ వర్క్ షాప్ చేయబోతున్నాడు జక్కన్న. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అది కంప్లీట్ అవగానే.. రాజమౌళితో జాయిన్ అవనున్నాడు మహేష్. ఇప్పటికే మహేష్ బాడీ బిల్డింగ్ మొదలెట్టేశాడు. మరోవైపు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతోంది. కొందరు హాలీవుడ్ స్టార్స్‌ను కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ ఏడాదిలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. అయితే రెగ్యూలర్ షూటింగ్ మాత్రం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఎందుకంటే.. వర్క్ షాప్ కోసమే దాదాపు ఆరు నెలల సమయాన్ని తీసుబోతున్నాడట జక్కన్న. ఈ ఏడాది చివర్లో వర్క్ షాప్ స్టార్ట్ కానుందట. ఇందులో మహేష్‌తో పాటు మిగతా స్టార్ క్యాస్టింగ్ అంతా జాయిన్ అవనుంది. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వబోతున్నాడు జక్కన్న. మరి ఈ సినిమాతో మహేష్, రాజమౌళి.. ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.