AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.