NRPT: మక్తల్ మండలం ముసలయ్యపల్లి గ్రామంలో శ్రీ నారద గడ్డ జాతర సందర్భంగా ఎద్దుల బండి లాగుడు పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఎద్దులతో ప్రతిభ చాటారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పవిత్ర, మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొని జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు.