అందంగా కనిపించేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సౌందర్య ఉత్పత్తులు వాడటం, చికిత్సలు చేయించుకుంటారు. అయితే సహజ పద్ధతుల్లో అందాన్ని పెంపొందించుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు, అధికంగా చాక్లెట్లు తింటే చర్మంపై ముడతలు వస్తాయి. ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల మొటిమలు ఏర్పడతాయి. పాస్తా, వైట్ బ్రెడ్, కేక్స్, ఉప్పు వంటివి మితంగా తినాలి.