»Hope Patna Railway Station Clip Was Mine Tweets Kendra Lust On Viral Video
Patna railway station: ఆ వీడియో నాదే కావొచ్చన్న అమెరికా ముద్దుగుమ్మ
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది.
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది. పాట్నాలోని వీడియోపై స్పందించిన ఈ నటి ఆ రైల్వే స్టేషన్ లో ప్లే అయిన వీడియో తన పోర్న్ వీడియో కావొచ్చునని ట్వీట్ ద్వారా అభిప్రాయపడింది. బీహార్ రైల్వే స్టేషన్ అనే హ్యాష్ ట్యాగ్ తో తన అందమైన చిత్రాన్ని ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ పైన పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. ఆ వీడియో నీది అని నీకు తెలుసా, నువ్వు అక్కడ ఉన్నావా.. నీకు ఎలా తెలుసు, ఆ వీడియో నీది అయితే కనుక.. భారత్ లో నీ వీడియోలు ఫేమస్ అవుతాయి… అంటూ వేలాది మంది వివిధ రకాలుగా ట్వీట్ చేశారు.
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పది ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. ఈ ప్లాట్ ఫామ్ ల పైన వందలాది మంది ప్రయాణీకులు ఆదివారం రాత్రి తమ ఎక్కవలసిన రైళ్ల కోసం వేచి (Waiting for Train) చూస్తున్నారు. కొంతమంది ఏమీ తోచక టీవీ చూస్తున్నారు. అలా చూస్తుండగా… హఠాత్తుగా టీవీ తెర పైన పోర్న్ వీడియో (Video) వచ్చింది. పది ప్లాట్ ఫామ్ లలోను టీవీలు ఉన్నాయి. అన్నింటా మూడు నిమిషాల పాటు ఆ పోర్న్ వీడియో టెలికాస్ట్ అయింది. దీంతో కలకలం చెలరేగింది.
ఇక్కడి రైల్వే స్టేషన్ లలో టీవీలలో వీడియోలు, ఫిలిమ్స్ టెలికాస్ట్ చేసే కాంట్రాక్ట్ ను ఓ ప్రయివేటు కంపెనీకి ఇచ్చింది స్థానిక దానాపూర్ డివిజన్ (Danapur division). ఈ విషయం తెలియగానే రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు వెంటనే సంబంధిత కంపెనీకి ఫోన్ చేసి, పోర్న్ వీడియో టెలికాస్టింగ్ ను నిలిపివేయించారు. తాము ఈ ఘటన పైన విచారణ జరిపి, కంపెనీతో కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసుకుంటామని, దీనికి సంబంధించి కేసు బుక్ అయిందని DRM ఆఫీస్ అధికార ప్రతినిధి ప్రభాత్ కుమార్ తెలిపారు. ఇది ఏమాత్రం క్షమించరాని నేరం అన్నారు. ఈ కంపెనీని తాము బ్లాక్ లిస్ట్ లో పెడతామని స్పష్టం చేశారు.