»Minister Rk Roja Slams Chandrababu Naidu And Lokesh
Rk Roja:3 చోట్ల గెలిస్తే చాలా? టీడీపీ నేతలపై రోజా విసుర్లు
Rk roja:ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ 3 సీట్లను (seats) గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని.. ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ నేత, మంత్రి రోజా (roja) స్పందించారు. 3 సీట్లు (seats) గెలిస్తే చాలా? అని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేశారు.

టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని రోజా (Rk Roja) ఆరోపించారు. 2019 ఎన్నికల నుంచి టీడీపీ ఒక్క సీటులో కూడా గెలవలేదని చెప్పారు. దీంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. ఈ 3 సీట్లలో గెలిస్తే.. శవాల నోట్లో తీర్థం పోసినట్టు ఉందని.. ఆ పార్టీ నేతలు అలా ఊహించుకుంటున్నారని రోజా (Rk Roja) ఘాటుగా కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీలు పార్టీ సింబల్.. సొంత ఓట్లతో గెలవలేదని మంత్రి రోజా చెప్పారు. అయినప్పటికీ ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నారని రోజా (Rk Roja) మండిపడ్డారు. టీడీపీ నేతలు చాలా ఎక్కువ చేస్తున్నారని.. అందుకే అసెంబ్లీలో స్పీకర్ను (speaker) అవమానించడం సరికాదన్నారు. ప్రజలంతా తిరిగి జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఇప్పటినుంచే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. విజయం తమదంటే.. తమదేనని అంటున్నారు.