AP: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో ఉమ్మడి తూ.గో. జిల్లా వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 2 లక్షల మంది జిల్లా వాసులు నివసిస్తున్నారు. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, అల్లవరం, ఉప్పలగుప్తం, కమలాపురం వాసులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. దీంతో జాగ్రత్తగా ఉండాలని తమ వాళ్లకు కుటుంబసభ్యులు, బంధువులు సూచిస్తున్నారు.