TPT: తిరుపతి జిల్లా క్రైమ్ విభాగం అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆయనకు అభినందనలు తెలియజేశారు. జిల్లా పరిధిలో చోరి నేరాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల్లో భద్రతాభావం బలోపేతం చేయడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.