TG: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో రాహుల్ వికారాబాద్ బయల్దేరనున్నారు. అక్కడ జరగనున్న పీఏసీ సమావేశం, డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా అక్కడ కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.