KDP: కాశినాయన మండలం గంగనపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్‌పై (24) దండగులు పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చిన్న వయసులోనే దిలీప్ మృతి చెందడంతో తలిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.