Balakrishna : NBK 108 టైటిల్ ఫిక్స్.. రేపే అనౌన్స్మెంట్!?
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి బిగ్ సర్ప్రైజ్ రాబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. మధ్యలో అన్‌స్టాపబుల్ షోతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి బిగ్ సర్ప్రైజ్ రాబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. మధ్యలో అన్‌స్టాపబుల్ షోతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో టాక్ షో చేసి రికార్డులు క్రియేట్ చేశారు. ప్రస్తుతం బాలయ్య.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. రీసెంట్గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ షూటింగ్లో జాయిన్ అయింది. అంతకు ముందే యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయింది. ఇందులో బాలయ్య కూతురిగా నటిస్తోంది శ్రీలీల. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే ఉగాది సందర్భంగా.. అంటే రేపే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఎన్బికే 108 అనే వర్కింగ్ టైటిల్‌తోనే మొదలు పెట్టారు. ఆ మధ్య ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు చిత్ర యూనిట్. కానీ ఉగాది కానుకగా నందమూరి అభిమానులకు పవర్ ఫుల్ గిప్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా ‘బ్రో ఐ డోంట్ కేర్’ టైటిల్‌నే ఫిక్స్ చేశారని వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి అనిల్ రావిపూడి.. బాలయ్యతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.