VKB: దేశంలో సుస్థిరమైన పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు.