వస్తువులపై ముద్రించిన ఎంఆర్పీ (MRP) కంటే ఎక్కువ ధర వసూలు చేయడం చట్టరీత్యా నేరం. రైల్వే స్టేషన్లు లేదా ఇతర ప్రాంతాల్లో ఇలా జరిగితే, వినియోగదారులు వెంటనే 139 నంబర్‌కు కాల్ చేసి లేదా రైల్ మదద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు, జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది.