RR: మియపూర్ డివిజన్ పరిధిలోని నాయనమ్మ కుంట చెరువు పునరుద్ధరణ పనులను MLA గాంధీ, ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఆనంద్ మల్లిగవాడ్, HDFC ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మొత్తం 64 చెరువులను CSR నిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.