ADB: సామాజిక న్యాయం, సాధికారతపై ఢిల్లీలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యుడిగా ఎంపీ గోడం నగేష్ పాల్గొన్నారు. 2024-25 సంవత్సర గ్రాంట్ల డిమాండ్లను సమీక్షించి, ఆమోదించడం తదితరాంశాలను చర్చించినట్లు తెలిపారు. అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇది ఒక ముఖ్యమైన సమావేశమని ఎంపీ నగేష్ పేర్కొన్నారు.