కరోనా తరువాత మంకీ పాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. అయితే దీనికి డెన్మార్క్‌కు చెందిన బవేరియన్ నార్డిక్ వ్యాక్సిన్ కంపెనీ టీకాను తయారు చేసింది. ఈ సంస్థ తయారు చేసిన ఎంవీఏ-బీఎన్ టీకా ఇకపై భారత్‌లోనూ తయారు కానుంది. పూణెలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్లో ఈ వ్యాక్సిన్లు తయారు చేయనున్నారు. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య నిన్న ఒప్పందం కుదిరింది.