MDK: చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయ 4వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. సోమవారం హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మంగళవారం బోనాలు, బుధవారం కళ్యాణం, అన్నదానం కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.