TG: MLA రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు పక్కనే ఉన్న మునుగోడును ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అభివృద్ధిలో ఇప్పటికీ మునుగోడు వెనుకబడి ఉందని అన్నారు. నల్గొంగ అంటేనే రాజకీయాలను శాసించే జిల్లా అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం వెనుకబడి ఉందని, నిధుల కేటాయింపులో వేగం పెంచాలని అభిప్రాయపడ్డారు.