జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాయుడు మరో సారి విమర్శల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే వరసగా ట్వీట్ల వర్షం కురిపించాడు.
పవన్ కి తిక్కుంది, దానికి బాబు దగ్గర లెక్కుంది అని ట్వీట్ చేశారు. అదే విధంగా జనసైనికులను ఉద్దేశించి కూడా ఓ ప్రశ్న వేశారు. జనసేనలో ఉన్న కార్యకర్తలంతా జనసైనికులా? బాబు బానిసలా అంటూ ప్రశ్నించారు. యుద్దానికి సిద్ధం అన్న నువ్వు, చంద్రబాబు సంకెక్కావ్ అని ఎద్దేవా చేశారు. పిరికివాళ్లందరూ కలిసి రండి చూసుకుందామని సవాలు విసిరారు.
విశాఖలో మంత్రులపై దాడి జరిగిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అక్కడి నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తునే ఉన్నారు.
తనను ప్యాకేజీ స్టార్ అంటే ఊరుకునేది లేదంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణమని, తాము విమర్శలు కొనసాగిస్తామని ఏపీ మంత్రులు తేల్చి చెప్పారు. మరోసారి పవన్ కళ్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాల్షీట్లు అయిపోయినట్లు ఉన్నాయని, అందుకే ఏపీని వదిలి హైదరాబాద్ వెళ్లిపోయాడని తాజాగా ఏపీ మంత్రి ఒకరు పవన్‌ను విమర్శించారు.