Bandi Sanjay క్షమాపణ చెప్పు.. కమిషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడున్న వారికి పోలీసులు సర్దిచెప్పారు.
కవితకు (kavitha) క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పకంటే బండికి (bandi sanjay) గుండు అని పోస్టర్లు కూడా కనిపించాయి. కవితకు (kavitha) సారీ చెప్పేవరకు ఇక్కడి నుంచి కదలం అని మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు. డెవలప్ చేసేవారిని చేయనీవ్వవు.. మీరు అభివృద్ధి చేయరు అంటూ విరుచుకుపడ్డారు.
ఇటు కమిషన్ ముందు హాజరైన బండి సంజయ్(bandi sanjay).. లాయర్‌ను లోపలికి తీసుకెళదాం అనుకున్నారు. కమిషన్ అనుమతించ లేదు. కవితపై (kavitha) తాను చేసిన కామెంట్లను సమర్థించుకున్నారు. ‘తాను మాట్లాడిన మాటలు తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలే అని.. సామెతను మాత్రమే అను పలికానని చెప్పారు. ఈ మేరకు రెండు పేజీల లేఖను మహిళా కమిషన్’కు ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత (kavitha) విచారణ గురించి ఇటీవల బండి సంజయ్ (Bandi sanjay) మాట్లాడారు. కవితను (kavitha) ఈడీ (ed) అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటుందా అని అన్నారు. దీంతో దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఆ పార్టీ నేతలు సంజయ్‌పై (sanjay) కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేయడంతో ఈ రోజు హాజరయ్యారు.