KTR:ఇద్దరు చేసిన తప్పు ఇదీ.. ఎవరినీ వదలం, పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్
KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు.
KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. ప్రవీణ్ (praveen), రాజశేఖర్ రెడ్డి (rajeshekar reddy) కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు. గత 8 ఏళ్లలో దేశంలో అత్యధిక ఉద్యోగాలు భర్తీ చేసిన కమిషన్.. టీఎస్ పీఎస్సీ (tspsc) అని కేటీఆర్ (ktr) అన్నారు. అత్యుత్తమ కమిషన్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఆయన చెప్పారు. ఏడు భాషల్లో ఓకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్ పీఎస్సీకి దక్కిందని చెప్పారు.
37 వేల ఉద్యోగాల భర్తీ చేసిందన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం నియామకాలు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. 10 లక్షల మందికి పరీక్షలు నిర్వహించిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సమీక్ష నిర్వహించామని మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. బీఆర్కే భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగం ఇచ్చేలా సవరణ చేసి.. రాష్ట్రపతి ఆమోదం తెలిపేలా చేసింది తామేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. సంస్కరణలకు సంబంధించి చర్చించామని.. సీఎస్‌కి సూచించామని కేటీఆర్ చెప్పారు. ప్రాథమికంగా అందుతున్న నివేదిక ప్రకారం.. ఇద్దరు చేసిన వ్యక్తుల తప్పు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యువత రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం పోరాడిందన్నారు. రెచ్చగొట్టే కామెంట్లను తప్పుపట్టారు. రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని సూచించారు.
పార్టీ పరంగా డీజీపీకి (dgp) ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి (rajashekar reddy) బీజేపీ క్రియాశీలక కార్యకర్త చెప్పారు. బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నారని.. ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయని తెలిపారు. నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్ర బండి సంజయ్ అనడంపై మంత్రి కేటీఆర్ (KTR) సందేహాం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కూడా విచారించాలని డీజీపీని (dgp) కోరారు. పేపర్ లీకేజ్ (paper leak) వెనక ఎవరు ఉన్న వదిలిపెట్టబోమని తెలిపారు.
పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని.. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కామెంట్లు చేయడం సరికాదన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి.. మాట తప్పారని మండిపడ్డారు.
టీఎస్ పీఎస్సీ రాజ్యాంగ బద్ద సంస్థ ఇందులో తమ సెక్రటరీ ఉంటారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీకి ఐటీ మినిష్టర్‌కు ఏం సంబంధం అని అడిగారు. గుజరాత్ పేపర్ లీక్ అయిన సమయంలో మంత్రి రాజీనామా చేశారా? మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కామ్‌కు సంబంధించి సీఎంపై ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. ఆయన రాజీనామా చేశారా అని అడిగారు. అసోంలో కూడా పేపర్ లీక్ అయ్యింది.. అక్కడ ఎవరైనా రిజైన్ చేశారా మంత్రి కేటీఆర్ అడిగారు. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో కంప్యూటర్ పాడైతే తనకేం సంబంధమా అని కేటీఆర్ అన్నారు. ప్రవీణ్ వెనక ఉన్న ఎవరూ ఉన్న వదిలిపెట్టబోం అని మంత్రి కేటీఆర్ అన్నారు.
4 పరీక్షలు రద్దయ్యాయని.. ఆ అభ్యర్థులు మళ్లీ ఫీజు కట్టనవసరం లేదన్నారు. గతంలో ఆప్లై చేసుకున్న వారంతా అర్హులేనని చెప్పారు. మెటిరీయల్ అంతా ఆన్ లైన్లో పెడతామని.. ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తామని తెలిపారు. జిల్లాల్లో ఉన్న రీడింగ్ రూమ్స్‌లో 24 గంటలు తెరిచి ఉంటాయన్నారు. రీడింగ్ రూమ్స్, స్టడీ సర్కిళ్లు తెరచి ఉంటాయని.. వారికి భోజన వసతి కూడా చేస్తామని పేర్కొన్నారు.