Budha Venkanna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో.... ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో…. ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఉత్తరాంధ్ర టీడీపీ ఇంచార్జ్ బుద్ధ వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ వచ్చేది చంద్రబాబు నాయుడే ఏపీకి సీఎం అవుతారని జోస్యం చెప్పారు.
నాని, వంశీ, అవినాష్ టీడీపీ భిక్షతో వచ్చిన వాళ్లేనని వెంకన్న గుర్తుచేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను గెలిపించిన ప్రజలకు బుద్ధ వెంకన్న శిరస్సు వంచి సమస్కరించారు. 2024లో వచ్చేది చంద్రబాబే నని దేవుడు స్క్రిప్ట్ రాసాడని అన్నారు.
14 నెలల ముందే భగవంతుడు ఫలితం చూపించాడని వెంకన్న తెలిపారు. కుప్పంలో చెత్తకుప్పని కూడా కొట్టలేరు మీరు అని వైసీపీ నేతలకు వెంకన్న సవాలు విసిరారు. 2024లో జగన్ పులివెందుల లో గెలిస్తే చాలు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాజీనామా చేసి జగన్ ఎన్నికలకు రావాలని బుద్దా వెంకన్న సవాలు విసిరారు.