ఎక్కువసార్లు టీని మరిగించి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. గుండె, కాలేయ ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు , దంతాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శరీరంలో ఐరన్, కాల్షియం లోపం తలెత్తుతుంది. శరీరం పోషకాలు గ్రహించడంలో ఆటంకం కలుగుతుంది.