యూఏఈ ఉప ప్రధాని, ఆ దేశ విదేశాంగమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలవటం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్- యూఏఈల సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. పశ్చిమ ఆసియాలో శాంతి భద్రతను పరిరక్షించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.